Sunday, April 28, 2024

Australia vs South Africa – డికాక్ మ‌రో శ‌త‌కం….. ఆసీస్ టార్గెట్ 312 ప‌రుగులు

ల‌క్నో – వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా నిర్ధారిత 50 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 311 ప‌రుగులు చేసింది. ఆస్ట్రేలియా విజ‌యం సాధించాలంటే 312 ప‌రుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో స‌ఫారీ ఓపెన‌ర్‌ డీకాక్ సెంచ‌రీ చేశాడు. 91 బంతుల‌లో 8 ఫోర్లు, అయిదు సిక్స‌ర్ల‌తో శ‌త‌కం నమోదు చేసుకున్నాడు..ఈ వ‌రల్డ్ క‌ప్ లో డికాక్ కి ఇది రెండో సెంచురీ.. ప్ర‌స్తుతం 109 ప‌రుగులు చేసి మూడో వికెట్గా వెనుతిరిగాడు….

కాగా లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియంలో జ‌రుతున్న ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకున్న‌ది. బ్యాటింగ్ దిగిన ద‌క్షిణాఫ్రికా తొలివికెట్ కు డికాక్,. బ‌వుమా లు 108 ప‌రుగులు జోడించారు.. బ‌వుమా 35 ర‌న్స్ చేసి మ్యాక్స్ వెల్ బౌలింగ్ లో అవుటయ్యాడు. అనంత‌రం బ‌రిలోకి వ‌చ్చిన డుస్సెన్ 26 ప‌రుగులు చేసి పెవిలియ‌న్ కు చేరాడు. మ‌క్రామ్ 56, మిల్ల‌ర్ 17, మార్కో 26 ప‌రుగులు చేసి ఔట‌య్యారు.. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో స్టార్క్ ,మ్యాక్స్ వెల్ లు రెండేసి వికెట్లు తీసుకోగా, క‌మిన్స్, హేజ‌ల్ వుడ్, జంపాలు త‌లా వికెట్ ద‌క్కించుకున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement