Tuesday, October 8, 2024

AP: అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు శారదా పీఠాధిపతులకు ఆహ్వానం

ఎన్టీఆర్, ప్రభ న్యూస్ బ్యూరో : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాలకు రండి అంటూ వినయ పూర్వకంగా శారదా పీఠాధిపతులను ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు ప్రత్యేకంగా ఆహ్వానించారు.

విశాఖ శారదా పీఠాధిపతుల వారు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీని, శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వామీజీని విశాఖపట్నంలో గురువారం కలిసి దేవస్థానంలో అత్యంత వైభవంగా నిర్వహించు శ్రీ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవముల సందర్భంగా ఆలయంనకు విచ్చేయవలసినదిగా కోరుచూ వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ దసరా మహోత్సవములు -2023 ఆహ్వాన పత్రికను, శ్రీ అమ్మవారి ప్రసాదములును ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఆలయ వైదిక సిబ్బంది అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement