Thursday, May 2, 2024

Australia vs India – బౌలింగ్ లోనూ భారత్ అదుర్స్ – 99 పరుగుల తేడాతో ఆసీస్ ఘోరపరాజయం

ఇండోర్ -‘ ఆస్ట్రేలియా కు భారత్ చుక్కలు చూపించింది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత దెబ్బకు ఆస్ట్రేలియా ఫ్యూజులు ఎగిరిపోయాయి. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టిన భారత్.. ఆస్ట్రేలియాను చిత్తు చిత్తుగా ఓడింది. 400 పరుగుల భారీ లక్ష్యంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు దిగగా.. మధ్యలో వర్షం అడ్డుతగిలింది. దాంతో డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆస్ట్రేలియా టార్గెట్ ను 33 ఓవర్లకు 317 పరుగులుగా నిర్ణయించారు.

అనంతరం ఆస్ట్రేలియా 28.2 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది. తద్వారా భారత్ డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 99 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా మరో మ్యాచ్ మిగలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది. నామమాత్రమైన మూడో వన్డే ఈ నెల 27న రాజ్ కోట్ వేదికగా జరగనుంది.

ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో డేవిడ్ వార్నర్ (39 బంతుల్లో 53; 7 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగిలిన బ్యాటర్లు విఫలం అయ్యారు. చివర్లో బౌలింగ్ ఆల్ రౌండర్ సీన్ అబాట్ (36 బంతుల్లో 54 ; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో అశ్విన్, రవీంద్ర జడేజాలు చెరో 3 వికెట్లు తీశారు. ప్రసిధ్ కు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో ఆస్ట్రేలియా వరుస పెట్టి వికెట్లను కోల్పోయింది. అసలు భారత్ ఆడిన పిచ్ పైనేనా ఆస్ట్రేలియా ఆడుతుంది అనే అనుమానం కూడా కలిగింది. ఆశలు పెట్టుకున్న స్టీవ్ స్మిత్ (0) గోల్డెన్ డకౌట్ అయ్యాడు. చివర్లో సీన్ అబాట్ పోరాడటంతో ఆస్ట్రేలియా 200 పరుగుల మార్కును దాటింది

.అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టపోయి 399 పరుగులు చేసింది. శుబ్ మన్ గిల్ (97 బంతుల్లో 104; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (90 బంతుల్లో 105; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) శతక్కొట్టుడు కొట్టారు. కేఎల్ రాహుల్ (38 బంతుల్లో 52; 3 ఫోర్లు; 3 సిక్సర్లు) తన సూపర్ ఫామ్ ను కొనసాగించాడు. సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) చుక్కులు చూపించాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement