Monday, April 29, 2024

Aus vs Ban : ఆసీస్ టార్గెట్ 307 ప‌రుగులు

పూణెలోని మ‌హారాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్ స్టేడియంలో ఆస్ట్రేలియా వ‌ర్సెస్ బంగ్లాదేశ్ జ‌ట్ల ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 43వ వ‌న్డే మ్యాచ్ జ‌రుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బంగ్లాదేశ్ జ‌ట్టు ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టింది.

బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్లు తౌహిద్ హృదయ్ 74 ప‌రుగులు, హోసియ‌న్ శాంటో 45 ప‌రుగులు, త‌న్జిద్ హ‌స‌న్ 36, లిట‌న్ దాస్ 36, మ‌హ్మ‌దుల్లా 32 ప‌రుగులు చేశారు. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో బంగ్లాదేశ్ జ‌ట్టు ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 306 ప‌రుగులు చేశారు. ఆస్ట్రేలియా జ‌ట్టు విజ‌య‌ల‌క్ష్యాన్ని చేరుకోవాలంటే 50 ఓవ‌ర్ల‌లో 307 ప‌రుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement