Monday, May 6, 2024

Asian Games … భార‌త్ అథ్లెటిక్స్ హ‌వా… రెండు బంగారు ప‌త‌కాల‌తో స‌హా 12 మెడ‌ల్స్ సాధించిన టీమ్ ఇండియా

ఏషియన్ గేమ్స్ 2023 ఇప్ప‌టి వ‌ర‌కు 23 ప‌త‌కాలు సాధించిన భార‌త షూట‌ర్స్ రికార్డ్ సృష్టించ‌గా, ఇప్పుడు తాజాగా ప‌త‌కాలు తీసుకొచ్చే బాధ్య‌త‌ను అథ్లెటిక్స్ తీసుకున్నారు.. నిన్న ప్రారంభమైన ఈ పోటీల‌లో తొలి రో్జున వెండి , కాంస్య ప‌త‌కాల‌తో ఖాతా తెరిచారు.. రెండో రోజైన ఆదివారం నాడు భార‌త్ అథ్లెట్స్ రెండు బంగారు, అయిదు వెండి , మూడు కాంస్య ప‌త‌కాల‌తో మొత్తం 12 మెడ‌ల్స్ భార‌త్ ఖాతాలో చేర్చారు..ఇక భాక్సింగ్ లో నితిన్ జ‌రీన్ నిరాశ ప‌రిచింది..

ముందుగా భారత అథ్లెట్ అవినాష్ సాబుల్ స్వర్ణం సాధించాడు. 3 వేల మీటర్ల స్టెప్లెచేస్‌ ఈవెంట్‌లో భారత అథ్లెట్ అవినాష్ సాబుల్ స్వర్ణం సాధించాడు. గత ఏడాది జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం గెలిచిన అవినాష్ సాబుల్, ఈసారి ఏకంగా పసిడి కైవసం చేసుకుని చరిత్ర క్రియేట్ చేశాడు. 8:19.50 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్న అవినాష్, సరికొత్త గేమ్ రికార్డుతో స్వర్ణం సాధించాడు. జపాన్‌ అథ్లెట్లు అవోకి రోమా, సునడా సీనాలకు రజత, కాంస్య పతకాలు దక్కాయి.

అలాగే షాట్ ఫుట్ ఈవెంట్‌లో భారత అథ్లెట్ తాజిందర్‌పాల్ సింగ్ తూర్, గోల్డ్ మెడల్ సాధించాడు.. మొదటి రెండు ప్రయత్నాల్లో ఫాల్స్ చేసిన తాజిందర్‌పాల్ సింగ్ తూర్, మూడో ప్రయత్నంలో 19.51 మీటర్లు విసిరాడు. నాలుగో ప్రయత్నంలోనూ ఫాల్ కాగా, ఆఖరి ప్రయత్నంలో 20.36 మీటర్ల దూరం విసిరిన తాజిందర్‌పాల్ సింగ్.. టాప్‌లోకి దూసుకెళ్లి స్వర్ణం సాధించాడు.


మ‌హిళ‌ల వంద మీట‌ర్ల హ‌ర్డిల్స పోటీలో జ్యోతి ఎర్రాజీ వెండి ప‌త‌కం సాధించింది.


ఇక 10 వేల మీటర్ల పరుగు పందెంలో భారత అథ్లెట్లు కార్తీక్ కుమార్ రజతం సాధించాడు,

- Advertisement -


మ‌హిళ‌ల 1500 ప‌రుగు పందెంలో హర్మెలిన్ బెయిన్ ర‌జ‌త ప‌త‌కం కైవ‌సం చేసుకుంది.


లాంగ్ జంప్ లో శ్రీక‌ర్ శంక‌ర్ సిల్వ‌ర్ మెడల్ గెల‌చుకున్నాడు..


పురుషుల 1500 ప‌రుగు పోటీల‌లో అజ‌య్ కుమార్ స‌రోజ్ సైతం వెండి ప‌త‌కం సాధించ‌గా,

భార‌త్ కే చెందిన జిస‌న్ జాన్స‌న్ కాంస్య ప‌త‌కం సాధించాడు…


మ‌హిళ‌ల హెఫ్త‌లాన్ విభాగంలో నందిని కాంస్య ప‌త‌కం సాధించింది.


డిస్క‌ల్ త్రో లో సీమా పునియా బ్రోంజ్ మెడ‌ల్ ద‌క్కించుకుంది.


నిన్న జ‌రిగిన 10వేల మీట‌ర్ల ప‌రుగులో భార‌త్ కు చెందిన కార్తీక్ వెండి,

గుల్వీర్ సింగ్ కాంస్యం ప‌త‌కాలు కైవ‌సం చేసుకున్నారు..

బాక్సింగ్ లో నితిన్ జ‌రీన్ నిరాశ .. కాంస్యంతో స‌రి ..
కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన నిఖత్ జరీన్ అసియ‌న్ గేమ్స్ లో బంగారు ప‌త‌కం టార్గెట్ గా బరిలోకి దిగిన బాక్స్ ర్ కు ఈ టోర్న‌మెంట్ చేదు అనుభ‌వాన్ని మిగిల్చింది. కాంస్య పతకంతో తృప్తి ప‌డాల్సి వ‌చ్చింది… థాయిలాండ్‌కి చెందిన చుతమత్ రక్షత్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 2-3 తేడాతో పోరాడి ఓడింది నిఖత్ జరీన్. అయితే నిఖత్ జరీన్, ఫైనల్‌కి అడుగు దూరంలో ఆగిపోయింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement