Tuesday, May 21, 2024

సొంత పోల్ రికార్డును బద్దలు కొట్టిన‌ మోండో డుప్లాంటిస్

ఒలింపిక్‌ చాంపియన్‌ మోండో డుప్లాంటిస్‌.. పోల్‌వాల్ట్‌లో తన ప్రపంచ రికార్డును తానే బ్రేక్‌ చేశాడు. బెల్‌గ్రేడ్‌ ఇండోర్‌ మీటింగ్‌లో స్వీడన్‌కు చెందిన డుప్లాంటిస్‌ 6.19 మీటర్ల ఎత్తు దూకి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 2020లో గ్లాస్గోలో జరిగిన ఇండోర్‌ గేమ్స్‌లో డుప్లాంటిస్‌ 6.18 మీటర్లతో రికార్డు సృష్టించాడు. ఈ ఫీట్‌ను సాధించేందుకు తొలుత చేసిన రెండు ప్రయత్నాలు విఫలం కాగా, మూడోసారి విజయం సాధించాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement