Sunday, April 28, 2024

IPL : అన్ని రికార్డులు స‌న్ కే…రికార్డ్ స్కోర్ లో నెంబ‌ర్ వ‌న్

ఐపీఎల్ 17 సీజన్ లో భాగంగా సోమవారం నాడు జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జరిగిన మ్యాచ్ లో ఎస్‌ఆర్‌హెచ్‌ 25 పరుగులతో విజయాన్ని సాధించింది. ఇక ఈ హై స్కోర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బీకర బ్యాటింగ్ తో పరుగుల సునామీ సృష్టించి మరోసారి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. దీంతోపాటు ఐపీఎల్ చరిత్రలోనే ఒక్క మ్యాచ్ లోనే అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ నిలిచింది. ఈ మ్యాచ్ తో సీజన్ లో నాలుగో విజయనందుకొని పాయింట్ల టేబుల్ లో నాలుగు స్థానంలో కొనసాగుతోంది.

ట్రావిస్ హెడ్ విశ్వ‌రూపం
ఇక మొదటగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి మూడు వికెట్లను కోల్పోయి 287 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఇక ఇందులో ఓపెనర్ గా వచ్చిన ట్రావిస్ హెడ్ తన విశ్వరూపాన్ని చూపించి.. 41 బంతుల్లో 8 సిక్సర్లు, 9 ఫోర్స్ సహాయంతో 102 పరుగులతో సెంచరీని సాధించాడు. ఆ తర్వాత వచ్చిన హెన్రీచ్ క్లాసెన్ కూడా 31 బంతులలో ఏడు సిక్సర్లు, రెండు ఫోర్ల సహాయంతో 67 పరుగులను సాధించాడు. దీంతో ఈ మ్యాచ్ లో ఏకంగా ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు 22 సిక్సర్లను బాధింది.

- Advertisement -

సిక్స‌ర్ల హ‌వా స‌న్ దే

ఐపీఎల్ క్రికెట్ చరిత్రలోనే ఒక్క ఇన్నింగ్స్ లో ఇన్ని సిక్స్ లు సాధించడం ఇదే ప్రథమం. ఈ క్రమంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఉన్న ఈ రికార్డు కాస్త ఎస్‌ఆర్‌హెచ్‌ అధిగమించింది. ఇక ఒక్క ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సులు సాధించిన జట్ల వివరాలు చూస్తే.. – సన్‌రైజర్స్ వర్సెస్ ఆర్‌సీబీ – 2024 లో 22 సిక్స్‌లు, ఆర్‌సీబీ వర్సెస్ పీడబ్ల్యూఐ – 2013 లో 21 సిక్స్‌లు, ఆర్‌సీబీ vs గుజరాత్ లయన్స్ – 2016 లో 20 సిక్స్‌లు, ఢిల్లీ డేర్‌డెవిల్స్ vs గుజరాత్ లయన్స్ – 2017 లో 20 సిక్స్‌లు, ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ – 2024 లో 20 సిక్స్‌లు లు సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement