Friday, May 17, 2024

అద‌ర‌కొట్టిన ఆదితి.. వరల్డ్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో తొలి వ్యక్తిగత స్వ‌ర్ణం..

వరల్డ్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో భారత ఆర్చర్‌ 17ఏళ్ల ఆదితి అద్భుతంగా రాణించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఉమెన్స్‌ వ్యక్తిగత విభాగం ఫైనల్‌లో ప్రత్యర్థి అండ్రీ బెసెర్రాను 149-147తో మట్టికరిపించింది. దీంతో బంగారు పతకం సాధించిన 17ఏళ్ల ఆదితి గోపీచంద్‌ స్వామి క్వాలిఫైయింగ్‌ రౌండ్‌లో సిక్త్‌ సీడెడ్‌గా బరిలోకి దిగింది. సీనియర్‌ వరల్డ్‌ చాంపిియన్‌షిప్స్‌లో వ్యక్తిగత విభాగంలో యువ క్రీడాకారిణి అగ్రస్థానంలో నిలిచింది. సెమీస్‌లో ప్రత్యర్థి భారత్‌ ఆర్చరీ సెకండ్‌ సీడెడ్‌ జ్యోతి సురేఖ వెన్నంను 149-145 తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.


కాగా, ఉమెన్స్‌ వ్యక్తిగత కాంపౌండ్‌ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ తన ప్రత్యర్థి టర్నీ క్రీడాకారిణి ఐపెక్‌ టామ్రుఖ్‌ను 150-146 తేడాతో విజయం సాధించి రజత పతకం కైవసం చేసుకుంది. మరో భారత ఆర్చర్‌ పర్ణీత్‌ కౌర్‌ క్వార్టర్‌ఫైనల్స్‌లో వెనుదిరిగింది. అంతకు ముందు జ్యోతి, పర్ణీత్‌ కౌర్‌, ఆదితి గోపీచంద్‌ త్రయం 235-229తో డఫ్నే క్వింటెరో, అనా సోఫా హెర్నాండేజ్‌ జియోన్‌, ఆండ్రియా బెసెరాల (మెక్సికో) బృందంపై విజయం సాధించి పసిడిని ముద్దాడిన విషయం తెలిసిందే. మొత్తంగా వరల్డ్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌ 2023లో భారత్‌ ఇప్పటి వరకు మూడు మెడల్స్‌ సాధించింది. ఇందులో రెండు గోల్డ్‌, ఒకటి బ్రోంజ్‌ మెడల్స్‌ ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement