Sunday, April 21, 2024

డివిలియ‌ర్స్ ఐపీఎల్ లెవ‌న్ కెప్టెన్ గా ధోని..

ఐపీఎల్‌లో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ ప్లేయ‌ర్స్‌లో సౌతాఫ్రికా ప్లేయ‌ర్ ఏబీ డివిలియ‌ర్స్ కూడా ఒక‌డు. రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు టీమ్‌కు ఆడుతున్న డివిలియ‌ర్స్‌.. 14వ సీజ‌న్ మొద‌ల‌య్యే ముందు త‌న ఫేవ‌రెట్ ఆల్‌టైమ్ ఐపీఎల్ లెవ‌న్ టీమ్‌ను ప్ర‌క‌టించాడు. అయితే ఐపీఎల్ లో డివిలియర్స్ కోహ్లీ కెప్టిన్సీలో ఆడుతున్నాడు. కాని ఈ ఆల్ టైమ్ ఐపీఎల్ లెవన్ కెప్టెన్ గా ధోనికి ఛాన్స్ ఇవ్వడం విశేషం. డివిలియ‌ర్స్ టీమ్‌లో ఓపెన‌ర్లు సెహ్వాగ్‌, రోహిత్ శ‌ర్మ కాగా.. మూడో స్థానంలో కోహ్లి, ఐదో స్థానంలో బెన్ స్టోక్స్‌, ఆరో స్థానంలో ధోనీ, ఏడో స్థానంలో ర‌వీంద్ర జ‌డేజా, ఎనిమిదో స్థానంలో ర‌షీద్ ఖాన్‌, 9లో భువ‌నేశ్వ‌ర్‌, ప‌దిలో కాగిసో ర‌బాడా, 11లో జ‌స్‌ప్రీత్ బుమ్రా ఉన్నారు. ఇక నాలుగో స్థానంలో త‌నను లేదంటే కేన్ విలియ‌మ్స‌న్ లేదా స్టీవ్ స్మిత్ అయితే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement