Sunday, May 19, 2024

Raveena Tandon: నిజం… ఈ అందానికి 15 ఏళ్లు….

కేజీఎఫ్2’ నటి రవీనా టండన్ లేటెస్ట్ లుక్ తో ఆశ్చర్యపరుస్తోంది. ఐదు పదుల వయస్సుకు దగ్గరున్న ఆమె తాజా లుక్ మాత్రం టూ యంగ్ గానే కనిపిస్తోంది. ప్రస్తుతం రవీనా స్టిల్స్ నెట్టింట వైరల్ గా మారాయి. బాలీవుడ్ నటి రవీనా టండన్ 30 ఏళ్లకు పైగా చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉన్నారు. 90 నుంచే సినిమాలు చేస్తూ వచ్చారు.

హిందీ చిత్రాలతో పాటు టీవీ షోల్లోనూ మెరిసింది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. స్టార్స్ సరసన ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. కన్నడ చిత్రం ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ తో రవీనా టండన్ పేరు దక్షిణాదిలోనూ మారుమోగిన విషయం తెలిసిందే. ఆమె నటనకు, దూకుడుగా వ్యవహరించిన తీరుకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.

- Advertisement -

తన పెర్ఫామెన్స్ కు ప్రశంసలు దక్కించుకుంది. ఆ తర్వాత నుంచి రవీనా టండన్ పేరు సోషల్ మీడియాలో మాత్రం మారుమోగుతోంది. పలు యాడ్ షూట్లలో నటిస్తూ ఆకట్టుకుంటోంది. నెట్టింట కూడా ఈ సీనియర్ నటి స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లతో ఆకట్టుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement