Saturday, May 4, 2024

Ayesha Khan: గుండె జారి పోతున్న‌ది….

బిగ్ బాస్ బ్యూటీ ఆయేషా ఖాన్‌.. ఏంటి ఈ పేరు తెలుగు బిగ్ బాస్ కంటెస్టంట్ల లిస్ట్ లో ఎప్పుడు వినలేదనుకుంటున్నారా? అవును ఈమె తెలుగు బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లలేదు. హిందీలో ఇటీవల ముగిసిన 17వ సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల కొద్ది రోజులకే బయటకు వచ్చేసింది. ఇక ఆ సీజన్ కు ఆమె రూమర్ బాయ్ ఫ్రెండ్ మునావర్ ఫరూకీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఇప్పుడు ఈ బ్యూటీ మరికొద్ది రోజుల్లో టాలీవుడ్ సినీ ప్రియులను అలరించనుంది. రెండేళ్ల క్రితం ముఖచిత్రం తెలుగు సినిమా చేసిన ఆయేషా ఖాన్.. ఇప్పుడు ఐటెం గర్ల్ గా సందడి చేయనుంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఈ బ్యూటీ ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈమె పేరు టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. అయితే ముఖ చిత్రం మూవీ లో విశ్వక్ సేన్ కూడా… గెస్ట్ రోల్ చేయడం గమనార్హం.

ఫేస్ మార్ఫింగ్ బ్యాక్‌ డ్రాప్‌ తో తెరకెక్కిన ఈ చిత్రంలో తన నటన తో ఆకట్టుకుంది ఆయేషా ఖాన్. మంచి మార్కులు కొట్టేసింది. ఇక సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది ఆయేషా ఖాన్. స్టైలిష్, ట్రెడిషనల్ ఔట్ ఫిట్స్ లో ఫొటోలు దిగి కుర్రకారును మాయ చేస్తుంటుంది. తాజాగా డార్క్ బ్లూ కలర్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో స్టన్నింగ్ పోజులు ఇచ్చింది. మనస్పూర్తిగా నవ్వుతూ మెరిసిపోతుంది. అందానికి ఇమేజ్ లా ఆకట్టుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement