Saturday, April 13, 2024

Sunny Leone: స్వ‌ప్న‌ సుంద‌రి….

బాలీవుడ్‌ స్టార్‌ నటి సన్నీ లియోన్‌ సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేయడం, అవి వైరల్‌ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఈ అమ్మడు చీర కట్టు ఫోటోలను షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. చీర కట్టులోని సన్నీ లియోన్‌ వీడియో వైరల్‌ అవుతోంది. సన్నీ లియోన్‌ ఏం చేసినా కూడా సంచలనమే అనడంలో సందేహం లేదు.

అలాంటి సన్నీ లియోన్‌ తెల్లటి చీర కట్టి, జడలో మల్లెపూలు ధరించి చేతికి గాజులు, సాంప్రదాయ నగలు ధరించి సన్నీ లియోన్‌ ఫోటోలకు ఫోజ్ ఇచ్చి కన్నులు తిప్పకుండా అందంగా కనిపిస్తుంది. అందాల సన్నీ లియోన్‌ ని తెల్లటి చీర కట్టుతో చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్‌ నైట్‌ తరహాలో సన్నీ లియోన్‌ రెడీ అవ్వడంతో పాటు, అలాగే సిగ్గు పడుతోందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. సన్నీ లియోన్‌ ను ఇంత సాంప్రదాయంగా చూసినా కూడా చాలా చక్కగా ఉందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement