Sunday, April 28, 2024

Shivani : సంగీత ద‌ర్శ‌కుడు స‌ర‌స‌న శివానీ…

ప్రముఖ దర్శకుడు పా.రంజిత్‌ ఆయన సినిమాల్లో ఏదొక ప్రత్యేకత ఉంటుంది.. దాంతో సినిమాలు ఒక ప్రత్యేకతను పొందుతాయి.. అలా ఆయన మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఒకవైపు డైరెక్టర్ గా వరుస సినిమాలు చేస్తూ.. మరోవైపు నీలం పేరుతో ఒక ప్రొడక్షన్ ను స్టార్ట్ చేశారు.

అంతేకాదు తన శిష్యులకు దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పిస్తూ వైవిధ్యమైన కథాచిత్రాలను నిర్మిస్తున్నా రు. గతంలో దర్శకుడు మారి సెల్వరాజ్‌ వంటి సక్సెస్‌ పుల్‌ దర్శకులను పరిచయం చేశారు. తాజాగా అకిరన్‌ మోసెస్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

- Advertisement -

ఇందులో అతనికి జంటగా టాలీవుడ్ హీరోయిన్ శివానీ రాజశేఖర్‌ నటిస్తున్నారు.. ఇక ఈ సినిమాలో శ్రీనాథ్‌ బాజీ, లింగేష్‌, విశ్వంత్‌ వంటి వరుకు నటిస్తున్నారు.. రంజిత్‌ నిర్మిస్తున్న సినిమా అంటే అంచనాలు వేరే లెవల్ లో ఉంటాయి.. వీరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది..శివానీకి ఈ మూవీలో మంచి రోల్ ల‌భించింద‌ని అంటున్నారు.. హిట్ అయితే కోలీవుడ్ లో మరిన్ని అవ‌కావాలు రావ‌చ్చ‌ని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement