Sunday, April 28, 2024

Malavika Mohanan : మైండ్ బ్లోయింగ్…

మలయాళ భామలంతా యాక్టింగ్ మీద ఫోకస్ చేస్తూ తమ టాలెంట్ చూపిస్తుంటే వారికి భిన్నంగా యాక్టింగ్ తోనే కాదు గ్లామర్ తో కూడా అదరగొట్టేస్తుంది అందాల భామ మాళవిక మోహనన్. మలయాళ సినిమాతో పాపులర్ అయిన అమ్మడు తమిళ సినిమాలతో అలరిస్తూ వస్తుంది. తెలుగులో అమ్మడు ఇప్పటివరకు స్ట్రైట్ సినిమా చేయలేదు. ప్రస్తుతం ప్రభాస్ తో రాజా సాబ్ సినిమా లో నటిస్తున్న మాళవిక ఆ సినిమా తో ఇక్కడ తిష్ట వేయాలని ఫిక్స్ అయ్యింది.

- Advertisement -

ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే ఫోటో షూట్స్ తో తన ప్రత్యేకత చాటుతుంది అమ్మడు. మాళవిక ఫోటో షూట్ చేసింది అంటే అది క్షణాల్లో వైరల్ అవ్వాల్సిందే. లేటెస్ట్ గా మాళవిక సీసైడ్ రిసార్ట్ అంటూ క్రేజీ ఫోటోస్ షేర్ చేసింది. ఇక ఈ ఫోటో షూట్ లో అమ్మడి గ్లామర్ షోకి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. బికినీ ట్రీట్ తో వేసవి తాపాన్ని మరింత పెంచేసింది మాళవిక.

అందాల వడ్డింపులో మిగతా భామలంతా ఒకవైపు మాళవిక మోహనన్ మరో వైపు అనేలా అమ్మడి అందాల ప్రదర్శన ఉంది. సినిమాల్లో కథాబలం ఉండేలా చూసుకుంటూ ఫోటో షూట్స్ లో మాత్రం గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేస్తున్న మాళవిక సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. మాళవిక లేటెస్ట్ బికిని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమ్మర్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న అమ్మడు తన గ్లామర్ షోతో ఫాలోవర్స్ కి కూడా కిక్ ఇస్తుంది.

ప్రభాస్ తో రాజా సాబ్ తో పాటుగా తమిళంలో విక్రమ్ సరసన తంగలాన్ సినిమాలో నటించిన మాళవిక అందులో డీ గ్లామర్ రోల్ తో సర్ ప్రైజ్ చేయనుంది. ఇక బాలీవుడ్ లో కూడా యుధ్రా సినిమాలో నటిస్తున్న మాళవిక అక్కడ కూడా పాగా వేయాలని చూస్తుంది. అమ్మడి ఫీచర్స్ చూస్తుంటే కచ్చితంగా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొన్నాళ్లు తన హవా కొనసాగించేలా ఉంది. ముఖ్యంగా మాళవిక గ్లామర్ షో ఫాలోవర్స్ కి మైండ్ బ్లాక్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement