Sunday, May 5, 2024

RC 16 : రామ్ చ‌ర‌ణ్ 16వ మూవీకి తొలి క్లాప్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోతున్న తన 16వ సినిమా ఎట్టకేలకు మొదలయ్యింది. నేడు పూజా కార్యక్రమాలతో సినిమాను అధికారికంగా లాంచ్ చేశారు. ఎంతో కాలంగా దర్శకుడు బుచ్చిబాబు ఈ ప్రాజెక్టును పట్టాలు ఎక్కించడానికి ఎదురుచూస్తూ ఉన్నాడు. ఉప్పెన సినిమా వచ్చి దాదాపు మూడేళ్లయ్యింది.

- Advertisement -

అయితే ఈ మధ్యకాలంలో అతనికి చాలా రకాల ఆఫర్స్ వచ్చాయి. కానీ నెక్స్ట్ చేస్తే పెద్ద హీరోతోనే సినిమా చేయాలి అని పట్టుదలతో ఎంతో ఓపికతో కథను సిద్ధం చేసుకున్నాడు. ఇక మొత్తానికి అతను అనుకున్నట్లుగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో సినిమాను పట్టాలు ఎక్కిస్తున్నాడు.

ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు .. ఇక దర్శకుడు శంకర్ తో పాటు అతని గురువు సుకుమార్ మెగాస్టార్ చిరంజీవి కూడా వేడుకకు వచ్చి బుచ్చిబాబుకు ప్రత్యేకంగా విషెస్ అందించారు.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ రామ్ చరణ్ కు జోడి క‌డుతున్న‌ది. ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మంలో ఆమె కూడా గోల్డెన్ శారీలో మెరుస్తూ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement