Friday, May 31, 2024

Polling : ఓటు హ‌క్కును వినియోగించుకున్న ప్ర‌ముఖులు

సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ నేడు ప్ర‌శాంతంగా ముగిసింది . ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు నేడు ఓటింగ్ నిర్వ‌హించారు.. ఇక తొలి గంటల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నెరవేర్చాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

ఓటు వేసిన రాష్ట‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి

దేశ రాజధాని దిల్లీలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ఆయన సతీమణి సుదేశ్‌ క్యూలైన్‌లో నిల్చుని ఓటు వేశారు.
కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైన వెంటనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన తొలి పురుషుడు ఈయనే కావడంతో అధికారులు సర్టిఫికేట్‌ ఇచ్చారు. ఆ విషయాన్ని ఆయన ఎక్స్‌లో పంచుకుంటూ తన సర్టిఫికెట్‌ చూపించారు.

ఓటు హ‌క్కు వినియోగించుకున్న ప్రియాంక కుటుంబం..
కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ కుమార్తె మిరయా, కుమారుడు రేహాన్‌ వాద్రా క్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్‌ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ కూడా ఢిల్లీలో ఓటేశారు..ఇక
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ తొలి గంటలోనే త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

కుటుంబంతో స‌హా అర‌వింద్ కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తన ఓటు వేశారు. కేజ్రీవాల్ తన భార్య, కుమార్తె, కుమారుడు, తండ్రిలో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

ఢిల్లీలోనే గంబీర్, క‌పిల్ దేవ్ లు

తూర్పు దిల్లీ ఎంపీ, మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌, కపిల్ దేవ్, భాజపా లోక్‌సభ అభ్యర్థి బన్సూరీ స్వరాజ్‌, ఆమె తండ్రి కౌశల్‌ స్వరాజ్‌, కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ దంపతులు, పారిశ్రామికవేత్త నవీన్‌ జిందాల్‌ కుటుంబం, దిల్లీ మంత్రులు సౌరభ్‌ భరద్వాజ్‌, ఆతిశీ, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌, హరియాణా సీఎం నాయబ్‌ సింగ్‌ సైనీ, మాజీ సీఈసీ సుశీల్ చంద్ర తదితరులు తొలి గంటల్లో ఓటేశారు. భవనేశ్వర్‌లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement