Wednesday, October 9, 2024

Ayesha Khan: టాలీవుడ్ లోకి దూసుకొస్తున్న అయేషా ఖాన్

పలువురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలియా భట్ నుంచి మొదలుకొని జాన్వీకపూర్ వరకు టాలీవుడ్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మరికొందరు తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరుస్తున్నారు. ఈ లిస్టులో మరో బాలీవుడ్ హీరోయిన్ చేరిపోయింది.

తాజాగా ఓ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ఆ హీరోయిన్ పేరు ఆయేషా ఖాన్. ఈమె తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ ఇటీవల హిందీ బిగ్ బాస్ సీజన్ 17 ద్వారా బాగా పాపులర్ అయింది. ఈ అమ్మడు ముఖచిత్రం అనే సినిమా ద్వారా తెలుగు వారికి పరిచయం అయ్యింది. ఇప్పటికే విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’ లో స్పెషల్ సాంగ్ లో నటించిన ఈ బ్యూటీ.

- Advertisement -

లేటెస్ట్ గా యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మాణంలో శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ‘ఓం భీమ్ బుష్’ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘లక్కీ భాస్కర్’ లో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అంతేకాదు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మరో సినిమా ఆఫర్ కూడా దక్కించుకున్నట్లు సమాచారం. అయేషా ఖాన్ నటిస్తున్న ఈ సినిమాల్లో ఏ ఒక్కటి హిట్టయినా ఈ అమ్మడి దశ తిరిగిపోయినట్లే.

Advertisement

తాజా వార్తలు

Advertisement