Friday, May 3, 2024

Falsh: ప్రధాని మోదీతో వైసీపీ ఎంపీలు భేటీ

ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్సార్‌సీపీ ఎంపీలు కలిశారు. బీసీ జనగణన జరపాలని ప్రధానికి ఎంపీలు సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ, బీసీ జనగణన చేయాలని.. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నా చట్టసభలో తగిన ప్రాతినిధ్యం లేదన్నారు. ఓబీసీల అభివృద్ధికి, ప్లానింగ్‌ కోసం ఖచ్చితమైన బీసీ జనాభా లెక్కలు అవసరమన్నారు. పార్లమెంట్‌, శాసనసభ, న్యాయ వ్యవస్థల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు.

దేశంలో 53 శాతం మంది బీసీలు ఉన్నారని.. అయినా బీసీలను రెండవ తరగతి పౌరులుగా పరిగణిస్తున్నారని ఎంపీలు ప్రధానికి తెలిపారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నా.. చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లేదన్నారు. ఓ బీసీల అభివృద్ధికి, ప్లానింగ్ కోసం ఖచ్చితమైన బీసీ జనాభా లెక్కలు అవసరమన్నారు. పార్లమెంటు, శాసనసభ న్యాయవ్యవస్థలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని.. బీసీ జనగణన చేయాలని ప్రధానిని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement