Thursday, May 16, 2024

మీ కంపెనీ టైం బాగోలేన‌ట్టుంది.. బిబిసి రిపోర్ట‌ర్ ని ప్ర‌శ్నించిన ర‌ణ్ బీర్ క‌పూర్

బిబిసి రిపోర్ట‌ర్ కి షాక్ ఇచ్చారు బాలీవుడ్ హీరో ర‌ణ్ బీర్ క‌పూర్. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం తూ ఝూటీ మే మక్కార్.ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సమావేశానికి వచ్చిన బీబీసీ జర్నలిస్టుకు ఊహించని ఝలక్ ఇచ్చారు ర‌ణ్ బీర్ క‌పూర్. బాలీవుడ్ సినిమాలు వసూళ్ల పరంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి కదా అంటూ ఆ బీబీసీ జర్నలిస్టు తన తొలి ప్రశ్న సంధించారు. దీంతో రణ్‌బీర్ మధ్యలో కల్పించుకుని అదేంటండీ అలా అంటారు..పఠాన్ సినిమా కలెక్షన్ల గురించి మీకు తెలియదా అని ఎదురు ప్రశ్న వేశారు. దీంతో.. ఆ జర్నలిస్టు మరో ప్రశ్న వేయబోతుండగా రణ్‌బీర్ మళ్లీ కల్పించుకున్నారు. ముందు మీరు అసలు ఏ పబ్లికేషన్‌ నుంచి వచ్చారో చెప్పండి. ఇప్పుడు మీ కంపెనీ టైం బాలేనట్టు ఉందిగా. ముందు దాని గురించి చెప్పండి అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న వారందరూ గొల్లున నవ్వారు. బీబీసీ వార్తా సంస్థ పన్ను ఎగవేసిందన్న ఆరోపణలపై ఐటీ అధికారులు ఇటీవల సంస్థకు చెందిన ఢిల్లీ, ముంబై కార్యాలయాల్లో ట్యాక్స్ సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement