Monday, April 29, 2024

మీరంతా నా కుటుంబం.. ట్వీట్ చేసిన సమంత

నేడు యశోద చిత్రం థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో హీరోయిన్ సమంత వన్ మ్యాన్ ఆర్మీలా ఈ సినిమాని తన భుజాలపై వేసుకుని నడిపించిందనే టాక్ వినిపిస్తోంది. కాగా తన అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేసింది సమంత. గతంలో కంటే ఈసారి సినిమాను ప్రమోట్ చేయడంలో మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను. యశోద సినిమాపై, నాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాల పట్ల ఎంతో సంతోషంగా ఉంది. మీ అందరికీ సదా కృతజ్ఞతలు. మీరంతా నా కుటుంబం. మీరు నిజంగా నా సినిమాను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. ధన్యవాదాలు..’అంటూ ట్వీట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement