Monday, April 29, 2024

Wrestlers – సెల‌క్ట్ చేయ‌లేద‌నే ఫోక్స్ కేసు – బ్రిజ్ పై ఈగ వాల‌నివ్వ‌ని పోలీసులు

న్యూ ఢిల్లీ – గ‌త రెండు నెలులుగా రెజ్ల‌ర్స్ వివిధ రూపాల‌లో ఆందోళ‌న చేస్తే రెజ్లింగ్ ఫెడ‌రేష‌న్ మాజీ చీఫ్ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ ను అరెస్ట్ చేయాల‌ని కోరుతున్నా పోలీసులు మాత్రం అత‌డి మీద ఈగ వాల‌నివ్వ‌డంలేదు.. లైంగిక వేధింపుల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క సాక్ష్యం ల‌భించ‌లేద‌ని, అలాగే ఆరోప‌ణ‌లు చేస్తున్న రెజ్ల‌ర్లు వాటికి సంబంధించిన ఫోటోలు, వాయిస్ మెస్సెజ్ లు, ఇత‌ర ఆధారాలు స‌మ‌ర్పించ‌లేద‌ని ఇప్ప‌టికే ఢిల్లీ పోలీసులు కోర్టు కు దృష్టి తెచ్చారు.. తాజాగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మీద పోక్సో కేసు రద్దు చేయాలని కోరుతూ పాటియాలా హౌస్ కోర్టు ముందు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో ఢిల్లీ కోర్టులో డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌పై పోక్సో చట్టం కింద నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని పోలీసులు సిఫార్సు చేశారు.

ఈ విషయమై కోర్టుకు 550 పేజీల నివేదికను కోర్టుకు పోలీసులు అందజేశారు. ఢిల్లీ పోలీసు అధికారులు పాటియాలా హౌస్ కోర్టుకు చేరుకుని ఈ అంశంపై రద్దు నివేదికను సమర్పించారు. “నేను ఎంపిక కాలేదు. నేను చాలా కష్టపడ్డాను. నేను డిప్రెషన్‌లో ఉన్నాను. అందుకే కోపంతో లైంగిక వేధింపుల కేసు పెట్టాను” అని మైనర్ రెజ్లర్‌ స్టేట్మెంట్ ఇచ్చిందని దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఈ కేసుపై కోర్టు జూలై 4వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement