Friday, May 17, 2024

ఉత్తరాఖండ్‌కు మహిళా సీఎం.. అధిష్టానం పరిశీలనలో రీతూ ఖండూరి పేరు

ఉత్తరాఖండ్‌లో వరుసగా రెండవసారి సంపూర్ణ మెజార్టీ సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసేదిశగా హైకమాండ్‌ ప్రయత్నాలు చేస్తోంది. అయితే, తొలిసారి ఓ మహిళను సీఎంగా ప్రకటించాలనే యోచన బీజేపీ అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. తదుపరి సీఎంగా రీతూ ఖండూరిని ఎంపికచేయడం గురించి చర్చిస్తున్నట్లు పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. మాజీ సీఎం బీసీ ఖండూరి కుమార్తే ఈ రీతూ ఖండూరి. కోట్‌ద్వార్‌ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు పైగా,ఆమె భర్త రాజేశ్‌ భూషణ్‌ కేంద్ర ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మోడీతో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ కారణాల దృష్ట్యా దాదాపుగా ఆమెనే ముఖ్యమంత్రిగా ప్రకటించొచ్చని భాజపా వర్గాలు చెబుతున్నాయి. రీతూ తోపాటు మరో నలుగురైదుగురు సీనియర్‌ నేతలు కూడా ముఖ్యమంత్రి పదవి కోసం అధిష్టానం వద్ద క్యూ కట్టారు. వారిలో మాజీ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌, కేంద్ర మాజీమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌, రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్‌ భట్‌ పేర్లు వినిపిస్తున్నాయి. కాగా ప్రభుత్వ ఏర్పాటు, సీఎం అభ్యర్థిపై చర్చించేందుకు రీతూ తోపాటు సుబోధ్‌ ఉనియాల్‌, సత్పాల్‌ మహరాజ్‌ వంటి పలువురు సీనియర్‌ నేతలు ఢిల్లిd చేరుకున్నారు. సీఎం రేసులో ప్రధానంగా సత్పాల్‌ మహరాజ్‌, ధన్‌సింగ్‌ రావత్‌, రీతూ ఖండూరి పేర్లు తుది జాబితాలోకి చేరినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement