Saturday, May 18, 2024

Suicide Attempt | టెలిగ్రామ్​లో వ్యక్తి పరిచయం.. అతనితో పెళ్లికి ఫ్యామిలీ ఒప్పుకోవడం లేదని..​

టెలిగ్రామ్‌లో పరిచయం అయిన వ్యక్తితో పెళ్లి చేయడం లేదన్న కోపంతో ఓ యువతి అఘాయిత్యానికి పాల్పడింది. తను నచ్చిన వ్యక్తితో పెళ్లి చేయడానికి ఆమె కుటుంబం వ్యతిరేకించడంతో 24 ఏళ్ల యువతి అపార్ట్​మెంట్​లోని రెండో అంతస్తు నుంచి కిందకు దూకేసింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఆ యువతి ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సెక్టార్ 121లోని అజ్నారా హోమ్స్ సొసైటీలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.  

కాగా, ఆ యువతి పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి MBA చదువుతున్నాడు. అతనికి 23 ఏండ్లు కాగా, అతను ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో ఉంటున్నట్టు సమాచారం. ఇక.. అతనితో ఆమెకు టెలిగ్రామ్‌లో పరిచయం అయ్యింది. వారి ఫ్రెండ్​షిప్​ గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు దీన్ని వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఆ యువతి ఫోన్​ని కూడా ​ లాగేసుకున్నారు. అందుకే ఆమె కోపంతో అపార్ట్​మెంట్​లోని రెండో అంతస్తు నుంచి కిందకు దూకింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement