Saturday, May 4, 2024

అంతరిక్షంలో పులియబెట్టిన ఈ వైన్ ధర తెలుసా..?

సాధారణంగా మద్యం ధరలను అది ఇచ్చే కిక్కుని బట్టి నిర్ణయిస్తాయి కంపెనీలు. ఇక మద్యం తయారీకి వాడే పదార్దాలను బట్టికూడా మద్యం ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి.. ఎంత మంచి కిక్కిచ్చే మద్యం అయినా మనదేశంలో లక్షలోపు దొరుకుతుంది. విదేశాల్లో ఆయ బ్రాండ్లు సరిపడ రేట్లు ఉంటాయి. కాని ఇప్పుడు ఓ వైన్ బాటిల్ ధర గురించే అందరి చర్చ నడుస్తోంది. ఆ బాటిల్‌కు 10 లక్షల డాలర్ల (దాదాపు 7 కోట్ల రూపాయలు) ధర పలకొచ్చని అంచనా వేస్తున్నారు. అసలు అంద ధర ఎందుకని ఆలోచిస్తున్నారా..? అవును కాని ఈ వైన్ స్పెషల్ అదే మరి.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఏడాదికి పైగా పులియబెట్టాకె ఈ వైన్ ను. ఐఎస్ఎస్‌లో ఏడాదికి పైగా ఉన్న `పెట్రస్ 2000` అనే ఫ్రెంచ్ వైన్ బాటిల్‌ను క్రిస్టీస్ సంస్థ వేలానికి పెట్టింది. ఈ బాటిల్‌కు 10 లక్షల డాలర్ల (దాదాపు 7 కోట్ల రూపాయలు) ధర పలకొచ్చని అంచనా వేస్తోంది. భూమికి వెలుపల వ్యవసాయం చేసే అవకాశాలపై పరిశోధన చేసేందుకు `స్పేస్ కార్గో అన్‌లిమిటెడ్` అనే సంస్థ 2019 నవంబర్‌లో 19 వైన్ బాటిల్స్‌ను అక్కడికి పంపింది.

దాదాపు 14 నెలల తర్వాత వీటిని తిరిగి భూమి పైకి తీసుకొచ్చింది. భూమిపై అంతే కాలం పులియబెట్టిన వైన్‌తో వీటి రుచిని పరిశోధకులు పోల్చి చూశారు. భూమిపై ఉన్న పానీయంతో పోల్చితే రోదసీలోకి వెళ్లి వచ్చిన వైన్ రుచిగా, మృదువుగా, సువాసనభరితంగా ఉందని తేల్చారు. అక్కడి వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు ఈ పరిశోధన చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement