Saturday, May 4, 2024

ఫుట్ పాత్ లు ఎక్క‌డ‌.!?.. నడవాలంటే చాలా కష్టం..

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ ప్రతినిధి : పాదచారుల భద్రతకోసం ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లు గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆక్రమణలకు గురవుతున్నాయి. కూరగా యల నుంచి మొదలుకుని బట్టల దుకాణాలు, సెల్‌ఫోన్‌ షాపులు, చెప్పుల దుకాణాలు తదితర చిన్నచితకా వ్యాపారులు ఫుట్‌పాత్‌లపై తిష్ట వేశారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టే షన్‌ ముందు అల్ఫా హోటల్‌ నుంచి మొదులకుని రేతిఫైల్‌ బస్టాండ్‌ వరకు ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లను సెల్‌ఫోన్‌, చెప్పులు, పం డ్లు, ఇతర వ్యాపారులు ఆక్రమించడంతో సాయంత్రం పూట పాదచారులు నడవడానికి కూడా స్థ లం లేకుండా పోతోంది. కోఠీ, సుల్తాన్‌బజార్లో ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌పై రెడిమెడ్‌ బట్టలు, బ్యాగులు, గాజులు, సెల్‌ఫోన్‌, బుక్‌స్టాల్స్‌ తదితర చిన్నచిన్న వ్యాపారాలు వెలిశాయి. అమీర్‌పేట, దిల్‌సుఖ్‌ నగర్‌లలో రెండువైపులా ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లను చిరు వ్యాపారులు ఆక్రమిం చడంతో ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో పాదచారులకు నరకం కనిపిస్తోంది. ప్రధాన కూడళ్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో వీధి వ్యాపారుల ఆక్రమణలు ఒక వైపు ఉంటే, మరో వైపు ఆయా షాపుల యజమానులు తమ వాహనాలకు పార్కింగ్‌ స్థ లాలుగా ఫుట్‌పాత్‌లను వాడుకుంటున్నారు. ఒక బస్సు దిగి మరో బస్టాప్‌లకు వెళ్లాల్సిన ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. షాపింగ్‌ సమయాల్లో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు సైతం ఫుట్‌పాత్‌లపై నిలపడంతో పాదచారులు నడవడానికి కనీస స్థ లం లేక నానా అవస్థ లు పడుతున్నా రు. సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 9గంటల వరకు రహదారులు నరకాన్ని చూపిస్తున్నాయి.

పట్టించుకోని జీహెచ్‌ఎంసీ..
ప్రమాద రహిత ప్రయాణమే లక్ష్యంగా నగర రహదారుల వ్యవస్థను తీర్చిదిద్దాల్సిన బల్దియా అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుతో పాటు సంబంధిత మంత్రి కేటీఆర్‌ సైతం పలు సందర్భాల్లో సూచించినప్పటికి జీ హెచ్‌ఎంసీ అధికారుల్లో చలనం లేదు. పాదచారుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఫుట్‌పాత్‌లను దుకాణదారులు, చిన్నాచితక వ్యాపారులు ఆక్రమించి దందా కొనసాగిస్తున్నారు. చిరు వ్యాపారుల కోసం ప్రత్యేక సముదాయాలను ఏర్పాటు చేయడం ద్వారా ఫుట్‌పాత్‌ల ఆక్రమణలకు అడ్డుకట్ట వేస్తామని గతంలో ఆర్భాటంగా ప్రకటించిన జీహెచ్‌ఎంసీ ఆ వైపు ప్రయత్నాలను అటకెక్కించింది. కొత్త ఫుట్‌పాత్‌లు, ప్రత్యామ్నాయ మార్గాలు దెవుడెరుగు ఉన్న ఫుట్‌పాత్‌ల ను ఆక్రమణల నుంచి కాపాడాలని పాదచారులు కోరుతున్నారు. .

ఆక్రమణదారులతో పోలీసుల దోస్తీ.
హైదరాబాద్‌ నగరంలో ఫుట్‌పాత్‌ల పర్యవేక్షణ బాధ్యతను జీహెచ్‌ఎంసీ కన్నా ట్రాఫిక్‌ పోలీసులే ఎక్కువగా చూస్తుంటారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు వారి కనుసన్నల్లోనే జరుగుతున్నాయినే విమర్శలున్నాయి. మనిషి ప్రాణాలు అత్యంత విలువైనవి కాబట్టి ప్రమాద రహిత ప్రయాణానికి అనుగుణంగా రహదారులను క్లియర్‌ చేయాల్సిన పోలీసులు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడు పెట్రోలింగ్‌ చేసి, రోడ్లపై ఉన్న సామాన్ల ను తీసుకెళ్లడం, పలువురిపై చిన్న మొత్తంలో పెనాల్టిdలు వేసి చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు పోలీసులపై వె ల్లువెత్తుతున్నాయి. పోలీసులు వచ్చినప్పుడు పక్కకు జరిగినట్టు నటించి తిరిగి వాళ్లు వెళ్లగానే యథేచ్ఛగా ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement