Sunday, April 28, 2024

Food Delivery: ఏం ఐడియా గురు…గుర్రంపై ఫుడ్ డెలివరీ

హైదరాబాద్‌లో ఓ యువకుడు వెరైటీగా ఆలోచన చేసి క‌స్ట‌మ‌ర్‌కు ఫుడ్ డెలివ‌రీ చేశాడు. ఈ డెలీవ‌రీ బాయ్ చేసిన ప‌నికి అంద‌రూ ఫిదా అవుతున్నారు.

దేశ వ్యాప్తంగా హిట్ అండ్ రన్ యాక్ట్ వల్ల ట్రక్, ట్యాంకర్లు చేపట్టిన ధర్నా కారణంగా నగరంలో భారీగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పాడింది. దీంతో ఈ ప్రభావం ఫుడ్ డెలివరీ చేసే బాయ్స్ పై పడింది. ఈ క్రమంలో ఓ యువకుడు వెరైటీగా ఆలోచన చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. హైదరాబాద్ లోని చంచల్ గూడలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ ఏకంగా గుర్రం మీద స్వారీ చేస్తూ.. ఫుడ్ ఆర్డర్ ను డెలివరీ చేయడానికి వెళ్తున్నప్పుడు నెటిజన్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఏం ఐడియా గురు అంటూ ఆ ఫుడ్ డెలివరీ బాయ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement