Monday, April 29, 2024

ఐరాస భద్రతా మండలిలో మద్దతు ఆశిస్తున్నాం.. భారత్‌పై రష్యా ఆశలు

రష్యా ఆర్మీ ఉక్రెయిన్‌లో చేపడుతున్న ఆర్మీ ఆపరేషన్‌పై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కీలక తీర్మానం తీసుకొచ్చిన సమయంలో.. భారత్‌ తమకు అనుకూలంగా వ్యవహరిస్తుందనే నమ్మకంఉందని రష్యా ఆశాభావం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితికి దారితీసిన కారణాలపై భారత్‌కు లోతైన అవగాహన ఉందనే భావిస్తున్నామన్నారు. రెండు దేశాల మధ్య ప్రత్యేక, కీలక వ్యూహాత్మక భాగస్వామ్యానికి అనుగుణంగా భారత్‌ నుంచి మద్దతు కోరుకుంటోందని రష్యా ఛార్జ్‌ డీ అఫైర్స్‌ రోమన్‌ బాబుష్కిన్‌ ప్రకటించారు.

ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యతో పాటు తూర్పు ఐరోపా దేశంలో తీవ్రం అవుతున్న పరిస్థితులపై ముసాయిదా తీర్మానం ఐరాస భద్రతా మండలి శనివారం సాయంత్రం ఓటు వేయనుందని తెలిపింది. భారత్‌కు చాలా అవగాహన ఉన్నందుకు అభినందిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. భారత్‌ వైఖరిని మెచ్చుకుంటూనే.. కొన్ని రోజుల క్రితం రష్యా దౌత్యవేత్త పారిస్‌లో విదేశాంగ మంత్రి జైశంకర్‌ చేసిన వ్యాఖ్యలను కూడా రష్యా ప్రస్తావించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement