Sunday, May 5, 2024

మావద్ద క్లస్టర్‌ బాంబులు ఉన్నాయి.. ఎప్పుడైనా ఉపయోగించే హక్కుంది : పుతిన్

ఉక్రెయిన్‌కు అమెరికా నుంచి క్లస్టర్‌ బాంబులు వచ్చినంతమాత్రాన భయమేమీ లేదని, తమవద్ద కావలసినన్ని క్లస్టర్‌ బాంబులు గుట్టలుగా ఉన్నాయని, వాటిని ఎప్పుడైనా ప్రయోగించే హక్కు తమకు ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. రష్యా దండయాత్ర నేపథ్యంలో మొదటినుంచి గట్టి మద్దతు ఇస్తున్న అమెరికా, తాజాగా క్లస్టర్‌ బాంబులను అందజేసింది. అవి తమ దేశానికి చేరాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించిన నేపథ్యంలో పుతిన్‌ స్పందించడం విశేషం. క్లస్టర్‌ బాంబులను దాదాపు వంద దేశాలు నిషేధించాయి. వీటిని ప్రయోగించినప్పుడు లక్షల బాంబ్‌లెట్స్‌ను ఎక్కువ విస్తీర్ణంలో వెదజల్లుతాయని, వాటివల్ల ప్రాణనష్టం తీవ్రంగా ఉంటుందని చెబుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement