Friday, May 3, 2024

విడాకులను రద్దు చేస్తున్నాం.. మాజీ భర్తలతోనే ఉండాలి

మహిళల విడాకులను తాలిబాన్‌లు రద్దు చేశారని, భర్తల చేతిలో వేధింపులకు గురై దూరంగా ఉంటున్న మహిళలను తిరిగి వారి మాజీ భర్తల వద్దకే వెళ్లి కాపురం చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి. అఫ్గానిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత తాలిబాన్‌లు పలు తీవ్రమైన ఆంక్షలు విధిస్తుండటం అంతర్జాతీయంగా చర్చాంశనీయం అయ్యింది. మహిళల చదువు, ఉద్యోగాలపై కఠినంగా వ్యవహరిస్తుండటం, విద్యాసంస్థల మూసివేత, బహిరంగ ప్రదేశాల్లో ఒంటరిగా తిరగడంపైనా నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఒకప్పుడు అఎn్గాన్‌లో యుఎస్‌ బలగాలు ఉన్న సమయంలో అక్కడి మహిళలకు కొంత స్వేచ్ఛ ఉండేది. అయితే, ఎప్పుడైతే తాలిబాన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే ఆగడాలకు అంతే లేకుండా పోయింది.

విడాకుల తీసుకున్న మహిళలపై తాలిబాన్‌లు దృష్టి పెట్టి, వారిని పలు విధాలుగా వేధిస్తున్నారు. గతంలో కూడా అఫ్గాన్‌ చట్టంపరంగా విడాకులు తీసుకున్న మహిళలను తమ మాజీ భర్తలతో కలిసిపోవాలంటూ తాలిబాన్‌ కమాండర్లు ఆదేశాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. గృహహింసకు వ్యతిరేకంగా పోరాడటం, చట్టపరంగా విడాకులు తీసుకున్నప్పటికీ వారి నుంచి దూరంగా వెళ్లే అవకాశం లేకపోవడం వంటి సవాళ్లు అఎn్గాన్‌ మహిళలు ఎదుర్కొంటున్నట్లు ఇటీవల ఐక్యరాజ్యసమితి కూడా పేర్కొంది.

షరియా చట్టం ప్రకారం నిర్ణయం తీసుకుంటాం : గతంలో విడాకులు తీసుకున్న మహిళలు వారి భర్తలతోనే కలిసి ఉండాలని ఒత్తిడి తెస్తున్నారనడంపై తాలిబాన్‌ ప్రతినిధులు స్పందించారు. అటువంటి ఫిర్యాదులు వస్తే దర్యాప్తు చేస్తామని, అనంతరం షరియా చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటామని తాలిబాన్‌ అధికార ప్రతినిధి ఇనాయతుల్లా మీడియాకు తెలిపారు. గతంలో తీసుకున్న విడాకులను ఆమోదిస్తారా అని ఆయన్ను అడిగినప్పుడు.. ఇది ముఖ్యమైన సంక్షిష్టమైన సమస్య అంటూ సరైన సమాధానం ఇవ్వకుండా దాట వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement