Wednesday, May 15, 2024

దేశానికే రోల్ మోడ‌ల్ డా వ‌రంగ‌ల్ కోర్టు..

హనుమకొండలోని వరంగల్‌ జిల్లా పది కోర్టుల భవనాలు దేశానికే రోల్‌ మోడల్‌గా నిలుస్తాయని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ.రమణ అన్నారు. వరంగల్‌ జిల్లా కోర్టు భవనం నమూనాను అందరికీ పంపిస్తామని స్పష్టం చేశారు. వరంగల్‌ పర్యటనలో భాగంగా నిన్న ఉదయం ఆయన భద్రకాళీ దేవాలయంతో పాటు వేయి స్తంభాల ఆలయాన్ని సందర్శించారు. అనంతరం అదాలత్‌లోని పది కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాజకీయాల్లో వరంగల్‌కు ప్రత్యేక స్థానం ఉందని, కళలకు కూడా వరంగల్‌ పుట్టినిల్లు అంటూ కొనియాడారు. దేశానికి ప్రధాన మంత్రిని అందించిన ఘనత వరంగల్‌ జిల్లాకే దక్కుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

తాను ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని కోర్టులను అందంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇది తన బాధ్యతగా భావిస్తున్నట్టు వివరించారు. తన ఆలోచనలకు అనుగుణంగానే.. వరంగల్‌ కోర్టును ఏర్పాటు చేశారని, ఎంతో సంతోషంగా ఉందన్నారు. వరంగల్‌ కోర్టును ఎలా అయితే నిర్మించారో.. అలాగే దేశంలో మోడ్రన్‌ కోర్టుల నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు. వరంగల్‌ కోర్టు నమూనానే దేశ వ్యాప్తంగా అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement