Friday, March 29, 2024

బాస్ పార్టీ సాంగ్.. మేకింగ్ గ్లింప్స్ వీడియో రిలీజ్

మాస్ ఎంట‌ర్ టైనర్ గా తెర‌కెక్క‌నుంది వాల్తేరు వీర‌య్య మూవీ.ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్నాడు.ఈ చిత్రంలో శృతిహాస‌న్ ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది. 2023 జనవరి 13న సంక్రాంతి కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది వాల్తేరు వీరయ్య. ఈ మూవీ నుంచి రీసెంట్‌గా బాస్‌ పార్టీ సాంగ్ విడుదలవగా.. సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తోంది.మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవీ శ్రీ ప్రసాద్‌ స్వయంగా రాసి కంపోజ్ చేసిన ఈ పాటను బాస్‌ పార్టీ పాటను నకాశ్‌ అజీజ్‌, డీఎస్పీ, హరిప్రియ పాడారు. కాగా బాస్ పార్టీ సాంగ్ మేకింగ్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశాడు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా-చిరంజీవి కాంబోలో వస్తున్న ఈ పాట మాస్‌ లవర్స్ కు కావాల్సిన ఎంటర్‌ టైన్‌ మెంట్ అందించడం ఖాయమని సాంగ్‌ తో తెలుస్తోంది.బాబీ (కేఎస్ ర‌వీంద్ర‌) దర్శకత్వం వహిస్తున్న వాల్తేరు వీరయ్య చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement