Friday, March 29, 2024

తెలుగులో ఛాన్స్ ల కోసం వెయిట్ చేస్తోన్న.. ఆత్మిక‌

అందం..ఆక‌ర్ష‌ణీయ‌మైన రూపంతో మెరిసిపోతోంది ఆత్మిక‌..దాంతో తెలుగులో స‌రైన అవ‌కాశాల‌కోసం వెయిట్ చేస్తోంది ఈ బ్యూటీ.ఇక్కడి యంగ్ హీరోల జోడీగా వరుస ఛాన్సులను కొట్టేసే లక్షణాలైతే పుష్కలంగానే కనిపిస్తున్నాయి. తమిళనాడుకి చెందిన ఈ బ్యూటీ తమిళ సినిమాతో 2017లోనే ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత మూడేళ్లపాటు గ్యాప్ తీసుకున్న ఈ సుందరి, అప్పటి నుంచి చక చకా అవకాశాలను అందుకుంటూనే వెళుతోంది.

హీరో విజయ్ ఆంటోని జోడీగా మెప్పించిన ఆత్మిక, త్వరలో ఉదయనిధి స్టాలిన్ జోడీగాను .. సందీప్ కిషన్ సరసన అలరించనుంది. ఇక టాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునే దిశగా ప్రయత్నాలు మొదలెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆత్మిక లేటెస్ట్ పిక్స్ ను రిలీజ్ చేశారు. నీలిరంగు శారీలో ఈ బ్యూటీ తళుక్కున మెరుస్తోంది. చక్కని కనుముక్కుతీరుతో .. ఆకర్షణీయమైన రూపంతో ఆకట్టుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement