Friday, April 26, 2024

రాధే శ్యామ్ లో ఎస్ఎస్ రాజమౌళి వాయిస్ ఓవర్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలితో గ్లోబల్ సెన్సేషన్ సృష్టించాడు, యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సాహోతో తన స్థానాన్ని మ‌రింత పెంచుకున్నాడు. ఈ సినిమాలకు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ అతన్ని గ్లోబ‌ల్ హీరోగా మార్చేసింది. ఇప్పుడు రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న రాధే శ్యామ్‌ చిత్రంలో ప్రభాస్‌ లవర్‌ బాయ్‌గా కనిపించనున్నాడు. తాజా నివేదిక ప్రకారం, SS రాజమౌళి, శివ రాజ్‌కుమార్, పృథ్వీరాజ్, అమితాబ్ బచ్చన్.. ప్రభాస్ మరియు పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్‌కు వాయిస్ ఓవర్స్ గా నిలిచారు..

రాధే శ్యామ్ తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ వెర్షన్‌కు ఎస్ఎస్ రాజమౌళి, శివ రాజ్‌కుమార్, పృథ్వీరాజ్ మరియు అమితాబ్ బచ్చన్ త‌మ స్వ‌రాన్ని అందించారు. ఈ విష‌యాన్ని ప్ర‌క‌టిస్తూ ఈ రోజు మధ్యాహ్నం రాధే శ్యామ్ మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసారు. రాధే శ్యామ్ మూవీ మార్చి 11న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం ఇంక ఇతర భాషలలో విడుదల కానుంది. సత్యరాజ్, భాగ్యశ్రీ, ప్రియదర్శి, మురళీ శర్మ, భాగ్యశ్రీ, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, కృష్ణం రాజు, కునాల్ రాయ్ కపూర్, సత్యన్, జయరామ్ కీలక పాత్రలు పోషించారు.. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement