Friday, April 26, 2024

నేడే విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ- గ్లింప్స్ రిలీజ్

నేడే విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ గ్లింప్స్ రిలీజ్ సాయంత్రం 5 గంటల 2 నిమిషాలకు గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్టు చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఇక్కడి నుంచి ఈ సినిమా నుంచి వరుస అప్ డేట్స్ ఉంటాయని అనుకోవచ్చు. ఈ చిత్రంలో హీరో కిరణ్ అబ్బవరం .. కశ్మీర జంటగా న‌టిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. మురళీ కిశోర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. టైటిల్ పోస్టర్ తోనే ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది. ఈ మధ్య కాలంలో కిరణ్ అబ్బవరానికి వరుస ఫ్లాపులు పడుతున్నాయి. పెద్ద బ్యానర్ .. మంచి కథ.. ఆకట్టుకునే టైటిల్.. ఫ్యామిలీ ఎంటర్టయినర్ జోనర్.. అందువలన ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఆయన ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement