Monday, May 20, 2024

విరాట‌ప‌ర్వం ప్రీరిలీజ్ ఈవెంట్ -గెస్టులుగా రామ్ చ‌ర‌ణ్..వెంక‌టేష్..సుకుమార్

హైద‌రాబాద్ లో విరాట‌ప‌ర్వం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది..ఈ ఈవెంట్ కి గెస్టులుగా మెగా పవర్ స్టార్ రాంచరణ్, బాబాయ్ వెంకటేష్, క్రేజీ డైరెక్టర్ సుకుమార్ అతిథులుగా హాజరు కాబోతున్నారు. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కింది ఈ చిత్రం. జూన్ 17న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో రానా నక్సలైట్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యే అతిథుల్ని కూడా ప్రకటించారు. ముగ్గురు క్రేజీ సెలెబ్రిటీలతో విరాట పర్వం ప్రీ రిలీజ్ ఈవెంట్ కనుల పండుగలా జరగనుంది. విరాట పర్వంపై రానా భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ చిత్రంలో రానా, సాయి పల్లవి ఇద్దరి రోల్స్ పవర్ ఫుల్ గా ఉండబోతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement