Friday, May 3, 2024

థియేట‌ర్ లోనే విరాట‌ప‌ర్వం – రిలీజ్ డేట్ త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం – హీరో రానా

విరాట‌ప‌ర్వం చిత్రం థియేట‌ర్ల‌లోనే రిలీజ్ కానుంద‌ని స్ప‌ష్టం చేశారు హీరో రానా.రీసెంట్ గా ఈ సినిమా రీ రికార్డింగును పూర్తిచేసుకుంది. ఒకటి రెండు రోజుల్లో ప్రివ్యూను చూడనున్నాం. ఈ సినిమా థియేటర్లలోనే విడుదలవుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామ‌ని వెల్ల‌డించారు. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో ప్రియమణి నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. సురేశ్ బాబు – సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. తెలంగాణ ప్రాంతంలో 1990లలో ఉన్న నక్సలిజం నేపథ్యంలో సాగే కథ ఇది. ఆశయం .. ఆవేశం .. సిద్ధాంతంతో ముడిపడిన పోరాటం, ఆ మధ్యలో పెనవేసుకున్న ప్రేమకథతో ఈ సినిమా నడుస్తుంది. సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమాను క్రితం ఏడాది ఏప్రిల్లో విడుదల చేయాలనుకున్నారుగానీ కుదరలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement