Wednesday, May 8, 2024

వీడియో: కోవిడ్ మాస్కుతో ముక్కు, మూతి తుడుచుకున్న సీఎం జగన్

పంద్రాగస్టు వేడుకల సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో సీఎం జగన్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అయితే ప్రసంగం సమయంలో మైక్ దగ్గరకు వచ్చిన ఆయన.. కోవిడ్ మాస్క్ తీసి ముక్క, మూతి తుడుచుకున్నారు. అంతటితో దానిని వదల్లేదు. అనంతరం అదే మాస్కును మళ్లీ ధరించారు.

అయితే సీఎం జగన్ చేసిన ఈ పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రూపాయి జీతం తీసుకునే సీఎం జగన్ నిరుపేద అని, అందుకే ఆయన ఇలా డబ్బు ఆదా చేస్తున్నారని పలువురు కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ వీడియో గురించి సీఎం కార్యాలయ వర్గాలు స్పందించాల్సి ఉంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement