Sunday, April 11, 2021

తెలంగాణలోని ఆ ప్రాంతంలో లాక్ డౌన్ !!

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని రాష్ట్రాలలోని ప్రాంతాలలో లాక్ డౌన్ కూడా పెడుతున్నారు. కాగా తెలంగాణలోని వరంగల్ అర్బన్ జిల్లా లోని కడిపికొండ గ్రామంలో సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకున్నారు గ్రామస్థులు. 15 రోజులపాటు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పటిస్తున్నట్లు దండోరా వేయించారు ఆ గ్రామ పెద్దలు.

గ్రామంలోకి ఎవరు రావద్దని కోరారు. కడిపికొండ లో మొత్తం 72 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా… ఒక్క రోజే 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఒకే కుటుంబంలో 13 మందికి ఈ మహమ్మారి సోకింది. ఈ నేపథ్యంలోనే వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో జగిత్యాల జిల్లాలోని సిరిపూర్ గ్రామంలో సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News