Friday, May 3, 2024

Vikky Kausal’s War Movie – ‘సామ్ బ‌హుదూర్’ మూవీ టీజ‌ర్ రిలీజ్…

బాలీవుడ్ యాక్టర్‌ విక్కీ కౌశల్ ప్ర‌ధాన పాత్రలో న‌టిస్తున్న తాజా చిత్రం సామ్​ బహదూర్. 971 ఇండో– పాక్​ వార్​లో బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతుండ‌గా.. ఈ వార్‌లో భార‌త్ విజ‌యానికి కారణమైన ‘సామ్​ మానెక్ షా’ జీవితం ఆధారంగా ఈ మూవీ రానుంది. . ఫీల్డ్ మార్షల్ సామ్ జంషద్ జీ మానెక్ షా ఇండియన్ ఆర్మీని నాలుగు దశాబ్దాల పాటు ముందుండి నడిపించాడు. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ నుంచి సైన్యంలోనే ఉన్న ‘మానెక్ షా’, 1971లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో ఇండియాని గెలిపించడంలో కీల‌క‌ పాత్ర పోషించారు. ఇక ‘సామ్ బహదూర్’ని ఇండియన్ గవర్నమెంట్ ‘పద్మ భూషణ్’, ‘పద్మ విభూషణ్’ పురస్కారాలతో సత్కరించింది. 1934 నుంచి 1973 వరకూ ఆర్మీలో త‌న సేవ‌లు అందించిన‌ ‘సామ్ బహదూర్’ 2008 జూన్ 27న మరణించారు.

ఇక ఆయ‌న బ‌యోపిక్ లో సామ్​మానెక్ షా పాత్ర‌లో విక్కీ కౌశల్ న‌టిస్తుండ‌గా.. ఇందిరా గాంధీ పాత్రలో సనా ఫాతిమా షేక్ ​ నటించింది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి మేక‌ర్స్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌గా తాజాగా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇక ఈ మూవీ డిసెంబ‌ర్ 01న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

YouTube video

.

Advertisement

తాజా వార్తలు

Advertisement