Friday, May 10, 2024

క‌న్న‌డ ద‌ర్శ‌కుడికి.. గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న త‌ర్వాత చిత్రాన్ని సెట్ చేసే ప‌నిలో ఉన్నాడు. అందులో భాగంగానే జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరికి విజయ్ ఛాన్స్ ఇచ్చాడు అన్న వార్త బాగా స్ప్రెడ్ అయింది… కానీ అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కన్నడ డైరెక్టర్ నర్తన్.. విజయ్ కి ఒక అదిరిపోయే స్టోరీ నెరేట్ చేసినట్టు.. దానికి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ లో వార్త వినిపిస్తోంది.

కన్నడలో శివరాజు కుమార్ తో మఫ్టీ సినిమా చేసిన నర్తన్ రాంచరణ్ మూవీ చేస్తున్నాడని.. యువి క్రియేషన్స్ ఈ సినిమా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారని గతంలో వార్తలు వినిపించాయి. అయితే నర్తన్ చెప్పిన స్టోరీ ఇప్పుడు విజయ్ దేవరకొండకు నచ్చడంతో దిల్ రాజు .. మరో కన్నడ నిర్మాణ సంస్థతో కలిసి నిర్మించబోతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement