Thursday, September 23, 2021

కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూత

కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. ఆస్కార్ ఫెర్నాండెజ్ గత జూలై నుంచి కర్ణాటకలోని మంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన మృతి చెందారు. కర్ణాటకలోని ఉడిపిలో 1941 మార్చి 27న ఆస్కార్ ఫెర్నాండెజ్ జన్మించారు. కాంగ్రెస్​లో ఆయన అనతికాలంలోనే కీలక​ నేతగా ఎదిగారు. 1984, 1989, 1991, 1996లో ఉడిపి నుంచే పోటీ చేసి ఎంపీగా లోక్​సభలో అడుగుపెట్టారు. 1998, 2004లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. యూపీఏ హయాంలో రోడ్డు-రవాణా, కార్మికశాఖ మంత్రిగా పాటు అనేక పదవులు చేపట్టారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగానూ ఫెర్నాండెజ్​ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కాంగ్రెస్​ అగ్ర నేత రాహుల్​ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఫెర్నాండెజ్​ గుర్తింపుపొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News