Saturday, July 27, 2024

హిట్ 2 ద‌ర్శ‌కుడితో విక్ట‌రీ వెంక‌టేష్ 75వ చిత్రం

విక్టరీ వెంకటేష్ తన 75 వ చిత్రాన్ని హిట్ 2తో భారీ హిట్‌ని అందించిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను తో చేస్తున్నాడు. శ్యామ్‌ సింఘరాయ్ కి మద్దతుగా నిలిచిన నిహారిక ఎంటర్టైన్‌మెంట్స్‌ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జనవరి 25, 2023న పెద్ద అప్డేట్ వస్తుందని ప్రకటించడానికి మేకర్స్ ప్రీ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. నిహారిక ఎంటర్టైన్‌మెంట్ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ భారీ స్థాయిలో తెరకెక్కనుంది. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రం లో భాగం అయ్యే అవకాశం ఉంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తారు మేకర్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement