Sunday, May 5, 2024

యాక్ష‌న్…ఛేజింగ్, ఎమోష‌న్స్ తో వ‌రుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది..

YouTube video

వరుణ్ తేజ్ హీరోగా బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ‘గాండీవధారి అర్జున’ సినిమా రూపొందింది. ఈ మూవీకి ప్రవీణ్ సత్తారు దర్శ‌కుడు. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. ఈ నేప‌థ్యంలో కొంతసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
యాక్షన్ .. ఛేజింగ్ .. ఎమోషన్స్ .. సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ఉత్కంఠను పెంచుతోంది. ‘భూమికి పట్టిన అతిపెద్ద కేన్సర్ మనిషేనేమో’ అంటూ నాజర్ చెప్పిన డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్.

ఈ సినిమా లో వరుణ్ తేజ్ సరసన నాయికగా సాక్షి వైద్య న‌టిస్తున్న‌ది. మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement