Saturday, October 26, 2024

తెలంగాణలో 18 ఏళ్లు నిండిన వారికి మే 12 తర్వాతే వ్యాక్సిన్ తొలి డోసు..

తెలంగాణ సర్కారు కీలక ప్రకటన చేసింది. మే 12 వరకు కరోనా వ్యాక్సిన్ తొలి డోసు ఇవ్వలేమని, రెండో డోసు తీసుకోవాల్సిన వారికే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేసింది. ఇప్పటికే తొలి డోసు తీసుకున్నవారు ఆ మేరకు సర్టిఫికెట్ చూపిస్తే రెండో డోసు వేస్తామని, ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు రెండో డోసు అందజేస్తామని వెల్లడించింది. దేశంలో 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ప్రకటన చేసినా, అది వాస్తవరూపం దాల్చడంలేదు. అనేక రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ కొరత ఉండడమే అందుకు కారణం. 45 ఏళ్లకు పైబడిన వారిలో తొలి డోసు తీసుకున్నవారిలో చాలామందికి రెండో డోసు ఇవ్వాల్సి ఉంది. టీకాలకు తీవ్రమైన కొరత ఉండడంతో రెండోడోసుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అంతలోనే కేంద్రం 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా టీకా అందించాలని ఆదేశించింది. అయితే డోసులు సరిపడా లేకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం మే 12 తర్వాతే 18 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ ప్రారంభించనున్నట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement