Friday, May 3, 2024

Uttarakhand: రిసార్ట్​లో పనిచేసే యువతి దారుణ హత్య.. బీజేపీ లీడర్ల పనేనని అనుమానం!

ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్‌లోని ఒక ప్రైవేట్ రిసార్ట్ లో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్న 19 ఏళ్ల యువతి మొన్న తప్పిపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ తర్వాత ఆ యువతి శవమై కనిపించింది. ఈ ఘటనలో ఆ రిసార్ట్ యజమాని, మేనేజర్‌తో సహా ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే నిందితుల్లో ఒకరికి బీజేపీతో సంబంధాలున్నాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపించడంతో పరిణామాలు రాజకీయ మలుపు తిరిగాయి.

పౌరీ గర్వాల్‌కు చెందిన అంకితా భండారీ అనే యువతి లక్ష్మణ్ ఝూలా ప్రాంతంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్ లో రిసెప్షనిస్ట్ గా పని చేస్తోంది. సెప్టెంబర్ 18న ఆమె రిసార్ట్ లో కనిపించకుండా పోయిందని, కుటుంబ సభ్యులు ఆమె మిస్సింగ్‌పై ఫిర్యాదు చేశారు. కానీ, మూడు రోజుల తరువాత సెప్టెంబర్ 21న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలిక అదృశ్యమైన రోజు నుండి రిసార్ట్ యజమాని, ఇతర ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

అంతకుముందు రోజు రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్య, అతని తండ్రి వినోద్ ఆర్య సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గరిమా ధాసోని మాట్లాడుతూ బాలిక మృతదేహం సెప్టెంబర్ 22, గురువారం లభ్యమైందని.. ఈ కేసులో నిందితులలో ఒకరైన వినోద్ ఆర్యకు బీజేపీతో సంబంధం ఉందని అందకే కేసును ఆలస్యం  చేశారని ఆరోపించారు.

https://twitter.com/uttarakhandcops/status/1573181109399351297
Advertisement

తాజా వార్తలు

Advertisement