Friday, June 14, 2024

Uttar Pradesh: రాయ్ బ‌రేలీలో రాహుల్ నామినేష‌న్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని రాయ్ బ‌రేలీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా రాహుల్ గాంధీ ఇవాళ‌ నామినేష్ వేశారు.. త‌ల్లి సోనియా గాంధీ, సోద‌రి ప్రియాంకా గాంధీ, ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున్ లు వెంట రాగా, త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను రిట‌ర్నింగ్ అధికారుల‌కు ఆయ‌న అంద‌జేశారు.. కాగా, ఈ స్థానంలో ఆయిదో ద‌శ‌లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది.. మే 20వ తేదీన ఇక్క‌డ ఎల‌క్ష‌న్ నిర్వ‌హించ‌నున్నారు..

కాగా, నామినేష‌న్ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యం నుంచి రిట‌ర్నింగ్ అధికారి కార్యాల‌యం వ‌ర‌కూ భారీ ర్యాలీ నిర్వ‌హించారు.. ఈ ర్యాలీలో రాహుల్ తో పాటు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.. ఇదిలా ఉంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ స్థానానికి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వ‌హించారు. ఆమె రాజ్య‌స‌భ‌కు ఎంపిక కావ‌డంతో ఆ స్థానం నుంచి ఆమె కుమారుడు రాహుల్ రంగంలోకి దిగారు.. ఇక రాహుల్ కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నుంచి కూడా పోటీలో ఉన్నారు.. ఆక్క‌డ పోలింగ్ ముగిసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement