Sunday, May 5, 2024

ఉస్తాద్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ళ్లీ లుంగీ క‌ట్టాడు..

హరీష్‌ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ .. తాజాగా ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లింది. పవన్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు..ఈ సెట్స్‌లో నుంచి పవన్‌కు సంబంధించిన లుక్‌ ఒకటి బయటకు వచ్చింది. ఆ ఫొటోలో పవన్ లైట్ గడ్డంతో లుంగీ కట్టులో కనిపిస్తున్నాడు. ఈ ఫోటోపై పవన్ అభిమానులు మాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే మరికొందరు మాత్రం భీమ్లా నాయక్‌ లుక్‌లానే కనిపిస్తందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమా కోసం పవన్‌ 50రోజులు కాల్షీట్లు ఇచ్చాడు. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది చివరి కల్లా పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement