Sunday, April 28, 2024

ఘనంగా ఉర్సు మహోత్సవం…

మండపేట : శాంతియుతంగా సమాజంలో అందరూ కలసి మెలసి జీవనం సాగించాలని సూఫీ మత ప్రభోధకులు హాజరత్ మహబూబ్ సుభాని పేర్కొనేవారని మండపేట జమియా మసిద్ ఇమామ్
మహమ్మద్ గులాం ముర్షిద్ రజ్వి అన్నారు. మండపేట 27 వ వార్డు పరిధి లోని గాంధి నగర్ లోని మహబూబ్ సుభాని జెండా 23 వ ఉర్సు గ్రందోత్సవం ఘనంగా నిర్వహించారు.  ఇక్కడ ప్రతి ఏటా గంధోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. గత ఏడాది కరోనా నేపధ్యంలో నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించగా ఈ ఏడాది ఘనంగా ఉత్సవాలు జరిగాయి. అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండా ఊరేగింపు నిర్వహించారు. గాంధీ నగర్, మెయిన్ రోడ్, కెపి రోడ్, రావులపేట, సయ్యద్ అల్లి పేట ల్లో గంధాన్ని ఊరేగించారు.పకీర్ల మేళా నిర్వహించిన  అనంతరం మహబూబ్ సుభాని జెండా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మండపేట జమియా మసిద్ ఇమాం ముహమ్మద్ గులాం ముర్షిద్ రజ్వి మాట్లాడుతూ సమాజాన్ని హింసా ప్రవృత్తి నుంచి విముక్తం చేయడానికి, శాంతియుత సహజీవనానికి అంకురార్పణ చేయడానికి సూఫీ ప్రబోధకులు మహబూబ్ సుభాని  చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు . ఆయన ప్రవచనం వల్ల  ప్రపంచంలో చాలా దేశాల్లో ఇస్లాం మతం విస్తరించిందన్నారు .అన్ని చోట్ల మహబూబ్ సుభాని స్మరణ గా పండుగను జరుపోకోవడం ఆనవాయితీగా పేర్కొన్నారు .  ప్రజల మధ్య ఐక్యతను సాధించి ప్రపంచ  భూభాగాన్ని నవ నాగరికతలోకి నడిపిన మహోన్నత  వ్యక్తి అని తెలిపారు .  అందుకే ఆయన చూపిన శాంతి, ఐక్యత నుంచి స్ఫూర్తినొందడం అందరికీ   అనుసరణీయమేనని  సూచించారు .  అనంతరం ఫాతిహా ఖాని నిర్వహించారు. ప్రసాద వితరణ కార్యక్రమం, విందు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో  ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement