Saturday, June 22, 2024

‘‘అంటే.. సుంద‌రుడి’’ బ‌ర్త్ డే హోమం.. అందరూ ఆహ్వానితులే!!

నాని, నజ్రియా లీడ్​ రోల్​ చేస్తున్న రొమాంటిక్, థ్రిల్లింగ్​ ఎంటర్​టైనర్​ మూవీ ‘అంటే.. సుందరానికి’ ఈ మూవీకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందించగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్ డేట్ వ‌చ్చింది..

ఫిబ్రవరి 24వ తేదీన పుట్టిన రోజు జ‌రుపుకోబొతున్న నాని కోసం ఓ స‌ర్ప్రైజ్ ని ప్లాన్ చేసింది మూవీ టీమ్​. దానికి సంబందించి ‘అంటే… మా యువ సుందరుడి పుట్టిన రోజు సందర్భంగా మేము జరుపుతున్న ఒక ‘Barthhday Homam’ ఫిబ్రవరి 23న సాయంత్రం గం 4:05 నిమిషాల నుండి మొదలు… అందరూ ఆహ్వానితులే ’’! అంటూ అప్ డేట్ ఇచ్చారు. ఇప్పుడిది సోషల్​ మీడియాలో తెగ షేర్​​ అవుతోంది.లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement