Friday, May 17, 2024

హైదరాబాద్ లో అన్‌లిమిటెడ్ బుక్‌ఫెయిర్.. వివ‌రాలివే !

పుస్తక ప్రియుల‌కి గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌లో ‘ది అన్ లిమిటెడ్ బుక్‌ఫెయిర్’కి నగరం ముస్తాబు కానుంది. వ‌చ్చే నెల‌ అగ‌స్ట్ 11 నుండి 20 వ తేదీ వ‌ర‌కు ఈ పుస్త‌క ప్రదర్శన జ‌ర‌గ‌నుంది. మారుతీ గార్డెన్స్, లక్డీ కా పూల్, నీలోఫర్ హాస్పిటల్ రోడ్, ఖైర్తాబాద్ వేదిక‌గా ఈ అన్ లిమిటెడ్ బుక్‌ఫెయిర్ జరగనుంది. ఈ పుస్తక ప్రదర్శన ఉద‌యం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుంది..

ఫ్లాప్, సౌండ్ బుక్స్, బోర్డ్ బుక్స్, ఎన్‌సైక్లోపీడియా, టచ్ & ఫీల్ బుక్స్, లెర్నింగ్ బుక్స్ తో పాటు.. ఫిక్షన్ తో – థ్రిల్లర్, క్రైమ్, హిస్టరీ, రొమాన్స్, క్లాసిక్స్, ఫాంటసీ, యంగ్ అడల్ట్ మొదలైనవి ఉన్నాయి. అంతే కాకుండా నాన్ ఫిక్షన్ స్టోరీస్ లో – ఆత్మకథ, వ్యాపారం, ఆరోగ్యం & ఫిట్‌నెస్, ప్రయాణం, క్రీడలు మొదలైన వాలితో పాటు దాదాపు 10 లక్షల పుస్తకాలను ఏర్పాటు చేయనున్నారు. కాగా, మరిన్ని వివరాల కోసం https://www.usedbooksfactory.com/box-events/detail/20/ వెబ్ సైట్ ని సందర్శించండి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement